పరవళ్లు
జులై 31, 2025
పరవళ్లు (paravallu)
అర్థము
(విశేష్యము) : గంతులు; వేగంగా పొర్లు/కదులు
Meaning
(noun) : to jump; move frenetically or turbulently
వాడుక / Usage
అడుగులా అష్టపదులా నడకలా జీవనదులా పరువాలే పరవళ్లు పరికిణీ కుచ్చిళ్ళు విరివాలు జడకుచ్చు సందళ్లు.
Footsteps or fulsome verses, gait or gallivanting rivers? ebullient youthfulness - frills of thy dress and braids of your flowered tresses - in merry.
మెదడుకు మేత / Food for thought
కమలములు నీట బాసిన
కమలాప్తుని రశ్మి సోకి కమలిన భంగిన్
తమ తమ నెలవులు దప్పిన
తమ మిత్రులు శత్రులౌట తథ్యము సుమతీ
(కమలములు తమ నివాసమైన నీటిని విడిచిపెట్టిన తరువాత తమ మిత్రుడైన సూర్యుని యొక్క ఎండ తాకుడుకే కమలుచున్నవి. అట్లే మానవులు తమ తమ హద్దులు దాటి ప్రవర్తించిన తమ స్నేహితులే తమకు శత్రువులగుదురు)
-- బద్దెన
Comments
Post a Comment