శైలూషి
ఆగష్టు 06, 2025
శైలూషి (ṣaīlūshi)
అర్థము
(విశేష్యము) : నటి; నర్తకి; ఆటకత్తె
Meaning
(noun) : an actress; a female performer/dancer
వాడుక / Usage
కైలాశ శిఖరాగ్ర శైలూషిఖా నాట్య ఢోలలూగే వేళ రావేల నన్నేల
On the peaks of Kailasa I gyrate dancing like a ballerina; come rule over my heart.
మెదడుకు మేత / Food for thought
నవరస భావాలంకృత
కవితా గోష్టియును, మధుర గానంబును దా
నవివేకి కెంత జెప్పిన
జెవిటికి శంఖూదినట్లు సిద్ధము సుమతీ!
(తొమ్మిది రసములతో కూడిన మంచి భావములతో శృంగారింపబడిన కవిత్వ సంబంధమైన సంభాషణమును, కమ్మని సంగీతమును జ్ఞానహీనునకు వినిపించుట, చెవిటివాని యొద్ద శంఖమును ఊదినట్లుండును)
-- బద్దెన
Comments
Post a Comment