ఎడద
ఆగష్టు 12, 2025
ఎడద (eḍada)
అర్థము
(విశేష్యము) : ఎద; హృదయం; గుండె; మనస్సు
Meaning
(noun) : the heart; mind
వాడుక / Usage
ఎడదల చప్పుడు తాళంగా విడుదల ఎరుగని కౌగిలిలో ఉదయరేఖ నుదుట దిద్ది కదిలి రావే నా సుందరి.
To the beat of heart, the streaks of dawn as vermilion, come my darling and lock me in your embrace forever.
మెదడుకు మేత / Food for thought
తెలివి యొకింత లేనియెడ దృప్తుఁడ నై కరిభంగి సర్వమున్
దెలిసితి నంచు గర్విత మతిన్ విహరించితిఁ దొల్లియిప్పు డు
జ్జ్వలమతు లై నపండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియని వాడ నై మెల గితిం గతమయ్యె నితాంతగర్వమున్
(ఏమి తెలియనప్పుడు నాకంతా తెల్సని మదగజంవలే విర్రవీగి ప్రవర్తిస్తుండేవాడిని. కాని, ఇప్పుడు పండితుల ద్వారా కొంత తెల్సుకొని, నాకేమి తెలియదనే సత్యాన్ని గ్రహించి పూర్వపు అహంభావం పోయి సుఖంగా ఉన్నాను)
-- సుభాషిత రత్నావళి, ఏనుగు లక్ష్మణ కవి
Comments
Post a Comment