జవ్వనము
ఆగష్టు 21, 2025
జవ్వనము (javvanamu)
అర్థము
(విశేష్యము) : యౌవనము; ఈడు; పడుచుతనము
Meaning
(noun) : youthfulness; adolescence
వాడుక / Usage
ఆ జవ్వనాలు నాకు దొరికిన నైరుతి ఋతుపవనాలు ఆ చిరునవ్వు లేత నెలవంక దిగివచ్చెనేమో ఇలవంక.
That youthfulness is respite of the monsoon winds; and the smile as tender as the crescent of the moon walking on this Earth.
మెదడుకు మేత / Food for thought
శ్రీమన్మహాదేవీ, లోకేశ్వరీ, కాళికాసన్నిభాకారిణీ, లోకసంచారిణీ, అంబ కాఫీ జగన్మోహినీ దద్బీజజాలంబు నైర్లండు, నింగ్లండు, హాలెండు, పోలెండు, రష్యా, జపాన్, జర్మనీ, గ్రీకు దేశంబులన్ నాటి పెన్ మ్రాకులై ఇండియన్ దోటలై విత్తనాలిచ్చుచున్నావటంచున్ మదిన్ దోచెనే , బాపురే, తీపిలో, నీరమున్, క్షీరమున్, జెక్కెరన్, మించిటంగాదే నీ బీజ చూర్ణంబు, నా మూటిలో జేర్చి సేవించుటన్ నీదు బీజంబులన్ బెంచులో మాడ్చి చూర్ణమ్ము గావించినన్ దీపిపోదాయె నీ మాధురీ శక్తి, నీ యింపు, నీ సొంపు, నీ పెంపు వర్ణింప నేనెంతవాడన్ నిన్ను బానంబు గావింపకున్నన్ ద్విజుల్ వేదమంత్రంబులన్ బల్కగాలేరు, శిల్పుల్ మనస్పూర్తిగా సుత్తి చేపట్టగాలేరు, వైశ్యోత్తముల్ కొట్ల తాళంబులన్ దీయగాలేరు, డ్రైవర్లు మోటార్ల స్టీరింగులన్ బట్టగాలేరు, టిచర్లు పాఠంబులన్ జెప్పగాలేరు, డాక్టర్లు నింజక్షనులన్ జేయగాలేరు, ప్లీడర్లు నోరెత్తి వాదింపగాలేరు...
-- అవధాని పోకూరి కాశీపతి
Comments
Post a Comment