వాచాలము
సెప్టెంబర్ 11, 2025
వాచాలము (vaachalamu)
అర్థము
(విశేషణము) : డంబాలు పలకడం; గొప్పలు చెప్పడం
Meaning
(adj) : pretentious; boastful
వాడుక / Usage
మన నాయకులకు వాచాలం ఎక్కువ, చేసే పని తక్కువ.
Our leaders are all talk and no action.
మెదడుకు మేత / Food for thought
అనురాగపు వెన్నెలలు కురిపించే జాబిల్లి
చెలిమిలోని నెత్తావులు వెదజల్లే సిరిమల్లిమనసులోన తలపులోన నిలిచిన నా నెచ్చెలి
ఆకురాలు వేల నీవు ఆమనివై వచ్చేవు
చీకటి కన్నుల వాకిట దీపము వెలిగించేవు
మూగవడిన హృదయవీణ తీగలు సవరించి
మధురగీతికలు ఎంతో హాయిగ వినిపించేవు
నీ చల్లని చేయి తాకి పల్లవించె నా హృదయం
నీ తీయని పలుకులలో కురిసెనులే అమృతం
నెచ్చెలీ నీవు లేక లోకమంతా శూన్యము
వాడనీకు ఏ వేళల చెలిమి పారిజాతము
-- సత్యవాడ సోదరీమణులు
Comments
Post a Comment