రుగ్మత

 

సెప్టెంబర్ 12, 2025

రుగ్మత (rugmata)

   అర్థము

  (విశేష్యము) : రోగము; నొప్పి

  Meaning

  (noun) : illness; disease; pain

    వాడుక / Usage

    వంద కోట్ల మందిలో మానసిక రుగ్మతలు.
    A billion people affected by mental illnesses.

  మెదడుకు మేత / Food for thought

    ఆకాశవీణపై ఉదయరాగం
    హృదయాకాశ వీణపై ప్రణయ రాగం
    కనగలిగే కనులుంటే
    వినగలిగే మనసుంటే ॥

    ఉదయానికి హృదయానికి రాగం ప్రాణం
    అది లేకుంటే జగతికేది జీవాధారం ॥

    తరులు గిరులు ఝరులు
    కసుమ వల్లరులు ఏవీ
    కలల వెన్నెలలు మన
    వలపుల వాకిళ్ళు ఏవీ ॥

    ప్రకృతి పురుషులోకటైతే
    రాగం భావం
    రాగానికి భావానికి
    రంగభూమి మధుమాసం ॥

    -- ఇంద్రగంటి శ్రీకాంత శర్మ (1944 - 2019)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

మలిసంజ