గుండ్రించు

 

సెప్టెంబర్ 15, 2025

గుండ్రించు (gunḍrinchu)

   అర్థము

  (క్రియ) : కడుపులో తిప్పటం

  Meaning

  (verb) : stomach churn when feeling sick; nausea

    వాడుక / Usage

    నేను తల పైకెత్తాలని ప్రయత్నించినప్పుడు మళ్ళీ గుండ్రించుకుని వచ్చింది.
    I tried to look up but the nausea hit me hard.

  మెదడుకు మేత / Food for thought

    పక్కనే ఉన్న దాన్ని పట్టించుకోకుండా దేనికోసమో తపించిపోతూ దిగంతానికేసి చూస్తూ ఒక అల్పుడు నిల్చుని ఉన్నాడు. వాడే నేను. జీవితాంతం అన్వేషించేవాడిగా – అధికారాన్ని, సుఖాన్ని, గుర్తింపుని! గుర్తింపుకోసమై చదరంగాలు, ఎత్తుగడలు, జట్టులు కట్టడాలు, కృత్రిమమైన నవ్వులు, అర్థంలేని వేలాది మాటలు. ‘Man, vain insect!’ అనే బైరన్ గర్జనని ఆరోజు ఆ అడవిలో, ఎగసే జ్వాలలా ఎరుపెక్కిన డాక్టర్ కె. గొంతుగా విన్నాను. పిడుగులు రాల్చే వేగంతో ఆకాశమే చూపుడువేలు చాచి మనిషికి చెప్పింది: ‘నీ ప్రేమ స్వార్థం. నీ స్నేహం మోసం. నీ నవ్వు అబద్ధం. నీ మాటలు గాలిలో మేడలు.’

    -- ఏనుగు డాక్టర్ - అవినేని భాస్కర్;  తమిళ మూలం 'యానై డాక్టర్' - జయమోహన్

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

మలిసంజ