నిరాడంబరము

 

సెప్టెంబర్ 16, 2025

నిరాడంబరము (niraaḍambaramu)

   అర్థము

  (విశేష్యము) : ఆడంబరం (హడావిడి, గర్వం, పటారం, జోరు) లేకపోవడం; 

  Meaning

  (noun) : not showing off; no vain display or pomp; simplicity

    వాడుక / Usage

    ఆయన నిరాడంబరత, అంకితభావాల గురించిన వింటున్నకొద్దీ ఆయన మీద గౌరవం పెరిగిపోసాగింది.
    The more I heard of his simplicity and dedication, my respect for him abounded.

  మెదడుకు మేత / Food for thought

    నిజానికి మనిషే అన్నిటికన్నా బలహీనమైన జంతువు. రోగాన్ని, నొప్పిని భరించడంలో జంతువులు చూపించే ఓర్పుని, గాంభీర్యాన్ని చూస్తే కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి. ప్రాణం పోయేంత నొప్పి ఉన్నా ఏనుగు ఏడవదు. తపించదు. కళ్ళు మాత్రం సగం మూసుకుని ఉంటుంది. శరీరంలో అక్కడక్కడా సన్నటి వణుకు కనిపిస్తుంది, అంతే! నిజానికి ఏనుగుకు మత్తుమందు ఇవ్వకుండానే సర్జరీ చెయ్యొచ్చు. అంత నెమ్మదిగా సహకరిస్తుంది. కానీ అలా చెయ్యము. వాట్ ఎ బీయింగ్! దేవుడు ఏనుగులను తను మంచి క్రియేటివ్ మూడ్‌లో ఉన్నప్పుడు సృష్టించి ఉంటాడు.

    -- ఏనుగు డాక్టర్ - అవినేని భాస్కర్;  తమిళ మూలం 'యానై డాక్టర్' - జయమోహన్

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

మలిసంజ