గొంతుకు
సెప్టెంబర్ 17, 2025
గొంతుకు (gonthuku)
అర్థము
(విశేషణము) : మోకాలి చిప్పలు గొంతు దగ్గరకు వచ్చేటట్లు కూచోవడం
Meaning
(adj) : sitting on haunches
వాడుక / Usage
డాక్టర్ కె. గొంతుక్కూర్చుని శ్రద్ధగా ఏదో ద్రవాన్ని పిపెట్‌లోకి తీసుకుంటూ ఉన్నారు.
Dr.K was sitting on his haunches and carefully pouring ingesting some liquid into the pipette.
మెదడుకు మేత / Food for thought
అన్ని జంతువులకంటేనూ ఏనుగులకు చాలా ప్రమాదకరం ఈ సీసాపెంకులు. ఏనుగు పాదాలు ఇసుక బస్తాల్లా మెత్తగా ఉంటాయి. విసిరిన ఖాళీసీసాలు ఏ చెట్టుకో తగిలి పగిలి చెట్లకింద గాజు పెంకులుగా పడివుంటాయి. ఏనుగులు తమ బ్రహ్మాండమైన బరువుతో వాటి మీద పాదం మోపగానే గాజు పెంకు క్షణంలో పాదం లోపల గుచ్చుకుంటుంది. రెండు అడుగులు వెయ్యగానే ఆ పెంకు పూర్తిగా పాదం లోపలకి వెళ్ళిపోతుంది. ఆ పైన ఏనుగుకు నడవడం అసాధ్యం. రెండే రోజుల్లో ఆ గాయం చీము పట్టేస్తుంది. పురుగులు పట్టేస్తాయి. పురుగులు మాంసాన్ని తొలుచుకుంటూ చీముని లోపలికి తీసుకుపోతాయి. ముఖ్యంగా రక్తనాళాలనో, ఎముకనో చేరుకుంటే ఇక ఆ ఏనుగు ప్రాణాలతో ఉండదు.
-- ఏనుగు డాక్టర్ - అవినేని భాస్కర్; తమిళ మూలం 'యానై డాక్టర్' - జయమోహన్
Comments
Post a Comment