మాలిమి

 

సెప్టెంబర్ 19, 2025

మాలిమి (mālimi)

   అర్థము

  (విశేష్యము) : వాత్సల్యము; ప్రేమ; ఓడ నడిపే శాస్త్రం; మచ్చిక

  Meaning

  (noun) : love; affection; fondness; science of navigation; tameness

    వాడుక / Usage

    మాలిమి చేసిన ఏనుగు కాలిమీద అడుగుపెట్టి పైకి ఎక్కి ఏనుగు కుంభస్థలం మీద కూర్చుని అడవిలో తిరిగాను.
    I sat on tamed elephants, by climbing on their legs, and roamed the forest.

  మెదడుకు మేత / Food for thought

    “వచ్చి తీసుకెళ్ళిపోతాయి, నువ్వు రా” అని డాక్టర్ చెప్తూ వెనక్కి తిరిగినప్పుడు ఉన్నట్టుంది ఇరవైకి పైబడిన ఘీంకారాలు కోరస్‌గా పెద్ద ఎత్తున వినిపించాయి. నా ఒళ్ళు పులకరించింది! కళ్ళనుండి నీళ్ళు కారిపోయాయి. గుండెలో ఏదో సందడి. చేతులెత్తి దణ్ణం పెడుతూ ఒక మాటయినా గుర్తుకురానివాడిలా నిశ్చేష్టుడై నిల్చున్నాను. ఏనుగుల గుంపు తొండాలను పైకెత్తి కలిసికట్టుగా మళ్ళీ మళ్ళీ ఘీంకరించాయి. అవును, దేవదుందుభులు మ్రోగాయి! గగనభేరీ మోగింది! నల్లటి మేఘాలు కమ్ముకున్న ఆకాశమంతా ఏనుగు ముఖపు ఆకారమున్న దేవతల దరహాసాలతో నిండిపోయింది.

    -- ఏనుగు డాక్టర్ - అవినేని భాస్కర్;  తమిళ మూలం 'యానై డాక్టర్' - జయమోహన్

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

మలిసంజ