ఇరుసు
సెప్టెంబర్ 24, 2025
ఇరుసు (irusu)
అర్థము
(విశేష్యము) : బండి(లేక మోటబావి) చక్రాలకు/గిలకకు అడ్డంగా వేసే కడ్డి; ఆక్షము
Meaning
(noun) : an axle; crossbeam on a water wheel
వాడుక / Usage
వాహనం యొక్క ఇరుసు పైకి కదలకుండా నిరోధించడానికి చక్రాల పైన రోలర్ సెట్‌ను అమర్చారు.
A roller set was attached on the top to prevent the axle from moving up.
మెదడుకు మేత / Food for thought
అస్మాన్ సాధువిచింత్య,సంయమధనాన్ ఉచ్చైఃకులంస్యాత్మనః
త్వయ్యస్యాః కథమప్యబాంధవకృతం స్నేహప్రవృత్తించ తాం
సామాన్య ప్రతిపత్తిపూర్వకమియం ,దారేషుదృశ్యాత్వయా,
భాగ్యాయత్తమతఃపరం ,నఖలు,తద్వాచ్యం వధూబంధుభిః!!
(అనునయం - మేమా ధనవంతులముగాము, తపమే మాకు గల ధనము,మా పిల్ల అడవులలో పెరిగినది. కల్లకపటము లెరుగనిది. మాయ మాటలు చెప్పి దానినెట్లో వశపరచుకొన్నావు. మాకుగూడా చెప్పుకొనలేని నీపై దానికి గల ప్రేమ యెంత ఘనమో గమనింపుము. మీ వంశ గౌరవమును గూడ మదినెంచుము. నీభార్యలలో నొకదానిగా దీనినేలుకొనుము. తక్కినది దాని భాగ్యము.ఇంతకన్న పుట్టినింటివారు కోరుట భావ్యము కాదు)
(బెదిరింపు - తపోధనులమైన మాగురించి బాగా ఆలోచింపుము. నీవే ధనవంతుడనని భావింతువేమో, నీ కన్న థనవంతులము మేము. లౌకికమైన నీ ధనము సాధింపలేని యనేక మహనీయమైన కార్యములు మా ధనము సాధించగలదు. అవసరమైన శాపముతో సహా, అదితెలిసికో! ఉన్నతమైన నీ వంశ గౌరవమునకు కళంకము కల్పించకు. మేము లేని వేళ మాకు తెలియకకుండ చేసిన యీ నీ నేరమునకు శిక్షపడకుండ రక్షించుకో! మాకు తెలుపకయే నిన్ను ప్రేమించిన దీని ప్రేమ యెంతఘనమో ఊహించుకో. నీ భార్యల యందు ఈమెకు ప్రత్యేక స్థానమునిచ్చి గౌరవింపుము. తక్కినది మేము కోరకుండగనే అదృష్టము ఆమెను వరింపగలదు.)
-- అభిజ్ఞాన శాకుంతలం, మహాకవి కాళిదాసు
Comments
Post a Comment