వాదర

 

సెప్టెంబర్ 25, 2025

వాదర (vaadara)

   అర్థము

  (విశేష్యము) : కత్తి యొక్క పదునైన అంచు; (పత్తి) బట్టలు; ఎరువులు; పనిముట్లు

  Meaning

  (noun) : edge of a sword; clothes; fertilisers; tools

    వాడుక / Usage

    దుర్గా మాత ధరించే ఖడ్గం కత్తి వాదర వలే పదును గల జ్ఞానాన్ని సూచిస్తుంది.
    The sword of Mother Durga signifies the sharpness of Gnana.

  మెదడుకు మేత / Food for thought

    శుశ్రూషస్వ గురూన్ కురుప్రియసఖీ వృత్తిం సపత్నీజనే,

    భర్త్ృర్విప్రకృతాపి రోషణతయా,మాస్మప్రతీపంగమః,

    భూయిష్టంభవ, దక్షిణాపరిజనే భాగ్యేష్వనుత్సేకినీ,

    యాంత్యేవం గృహిణీపదం యువతయోః వామాః కులస్యాధయః!

    (అమ్మా!నీయత్తవారింట పెద్దలను సేవింపుము. సవతులయెడ స్నేహమును ప్రదర్శింపుము, నీభర్త కోపగించినా నీవును కోపముతో నెదురాడకుము. విముఖతను జూపకుము. ధనమున్నదని విర్రవీగక సేవకులయెడ దయను జూపుము. ఆడపిల్ల అత్తింట ఈ తీరున మెలగిన ఉత్తమ గృహిణియనిపించుకొనును. దీనికి విరుధ్ధముగా మసలువారు పుట్టినింటికి బాధ పెట్టువారగుదురు)

    -- అభిజ్ఞాన శాకుంతలం, మహాకవి కాళిదాసు

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

మలిసంజ