పొలయలుక
సెప్టెంబర్ 26, 2025
పొలయలుక (polayaluka)
అర్థము
(విశేష్యము) : ప్రేమ కలహం; ప్రణయ కోపం
Meaning
(noun) : lover's quarrel
వాడుక / Usage
చెలుల పొలయల్కలే ప్రేమజీవకళలు పానకమునకు మిరియంపుఁ బసలు వోలె.
Anger of a damsel in love enlivens romance; much as spices in a sweet syrup.
మెదడుకు మేత / Food for thought
యాస్యత్యద్యశకుంతలేతిహృదయం సంస్పృష్ట ముత్కంఠయా,
కంఠస్తంభితభాష్పవృత్తికలుష శ్చిన్తాజడందర్శనమ్,
వైక్లబ్యమమ తావదీదృశమహో స్నేహాదరణ్యౌకసః,
పీడ్యంతే గృహిణః కథన్ను తనయా విశ్లేషదుఖైర్నవైః!!
(ఈరోజు శకుంతల అత్తవారింటికేగుచున్నదని నా హృదయమేలనో తత్తరపడుచున్నది. ఒక్క మారుగా తెలియని విషాదము నా హృదమునాక్రమించినది. కన్నుల నీరూనుట కంఠము బొంగురు వోయినది. కనుచూపు మసకబారినది. ఏదో ఒకింత కాలము పెంచిన నాకే యిట్లున్నదే, నిజముగా తాము కని పెంచిన కూతురు నత్తవారింటికి పంపునపుడా తలితండ్రులెంత బాధ అనుభవింతురో గదా?!)
-- అభిజ్ఞాన శాకుంతలం, మహాకవి కాళిదాసు
Comments
Post a Comment