శ్రేయస్సు

 

సెప్టెంబర్ 30, 2025

శ్రేయస్సు (ṣrēyassu)

   అర్థము

  (విశేష్యము) : శుభము; మంచి; మోక్షము

  Meaning

  (noun) : welfare; good; well being

    వాడుక / Usage

    సంపదను అధ్యయనం చేసే సంప్రదాయ నిర్వచనాల నుండి భిన్నంగా, ఆల్ఫ్రెడ్ మార్షల్ ఆర్థిక కార్యకలాపాల ద్వారా ప్రజల శ్రేయస్సును పెంచడంపై దృష్టి సారించారు.
    Contrary to traditional theories of economics focused on wealth, Alfred Marshall looked at economic activities aiding the welfare of people.

  మెదడుకు మేత / Food for thought

    మధ్య తరగతి జీవితాన్ని పాప్యులర్ నవలా రచనలో ఇమడ్చవచ్చని నిరూపించిన రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి. చిక్కుడు గింజల వేపుడు లాంటి మధ్య తరగతి దైనందినిక ప్రస్తావనలు చంటబ్బాయ్ నవలలో కనిపిస్తాయి. లెక్కకు మించిన వ్యాపార నవలలు, ట్రావెలోగ్స్, ఆ తర్వాత ఆధ్యాత్మిక సాహిత్యం కూడా వెలువరించారు. స్వస్థలం విజయవాడ.

    -- కథలు ఇలా కూడా రాస్తారు, మహమ్మద్ ఖదీర్ బాబు

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

మలిసంజ