కొరత
అక్టోబర్ 01, 2025
కొరత (koraṭha)
అర్థము
(విశేష్యము) : తక్కువ; అవసరానికి సరిపడ సరుకులు లేకపోవడం
Meaning
(noun) : scarcity; incompleteness
వాడుక / Usage
ఆర్థిక శాస్త్రాన్ని "అపరిమితమైన మానవ కోరికలను, వాటిని తీర్చడానికి ఉన్న కొరతైన వనరులను అధ్యయనం చేసే శాస్త్రం" అని నిర్వచించినది లియోనెల్ రాబిన్స్.
Lionel Robins postulated Economics as the study of unlimited human wants and the scarce resources available to satisfy them.
మెదడుకు మేత / Food for thought
'క్షుద్ర సాహిత్యం' అని సీరియస్ పాఠకులు ముద్ర వేసిన సాహిత్యాన్ని రచయిత యండమూరి వీరేంద్రనాథ్ తన 'తులసీదళం' (1980) నవలతో శక్తిమంతంగా తెలుగునాట ప్రవేశపెట్టారు. యండమూరి - వెన్నెల్లో ఆడపిల్ల, డబ్బు టు ది పవర్ ఆఫ్ డబ్బు, అంతర్ముఖం వంటి నవలలతో పాప్యులర్ అయ్యారు. దానికి ముందు నాటకాలు రాశారు. అనేక సినిమాలకు పని చేశారు. స్వస్థలం తూర్పు గోదావరి జిల్లా.
-- కథలు ఇలా కూడా రాస్తారు, మహమ్మద్ ఖదీర్ బాబు
Comments
Post a Comment