ఎడ్డి
సెప్టెంబర్ 09, 2025
ఎడ్డి (yeddi)
అర్థము
(విశేషణము) : మోటు; మురికి; అప్రస్తుతం; మూఢుడు
Meaning
(adj) : uncouth; foolish; obstinate; out of turn
వాడుక / Usage
ఇప్పటి ఎడ్డి మందకు ఏం తెలుసు ఆయన విలువ.
The current crop of foolish leaders don't know his eminence.
మెదడుకు మేత / Food for thought
అలికిడైతే చాలు - ఆశతో నా కనులు
వెదకేను నలుదిశల - అతడేమొ అనుకొని
కమ్మతావులతోడ - నెమ్మదిగననుచేర
నీలిముంగురులలో - గాలి ఊయలలూగ
కనులు మూసి నేను కలత నిదురపోవ
జాజిపూవుల మాల - జాడ చిక్కెడి కాడ
రోజాలు కోయగా తోటలోనికి రాగ
కొంటె ముల్లొకటి నా - కొంగు చివరను లాగ
అలికిడైతే చాలు - ఆశతో నా కనులు
వెదకేను నలుదిశల - అతడేమొ అనుకొని
-- దేవులపల్లి కృష్ణ శాస్త్రి (1897 - 1980)
Comments
Post a Comment