నల్లికుట్లతనం
సెప్టెంబర్ 10, 2025
నల్లికుట్లతనం (nallikutlatanam)
అర్థము
(విశేష్యము) : బయటపడకుండా ఉండడం; నంగనాచి; తెలియనట్లు నటించడం
Meaning
(noun) : pretending simplicity or innocence
వాడుక / Usage
తాను వెన్నుపోటు, నల్లికుట్ల రాజకీయం చేయనని ఆమె అన్నారు.
She said that she doesn't indulge in backstabbing and deceptive politics.
మెదడుకు మేత / Food for thought
అంతులేని ఆశలున్న అంతరంగమా
ఊహాలలో తేలుతున్న ఓ విహంగమా
స్వార్ధానికి నీలోపాల స్ధానము కల్పించకూ
స్వంత లాభముకయి పరుల సౌఖ్యము కబళించకూ
ఆనందం ఎదురైన ఆవేదన కెరటానా
చిరునవ్వే చిందనీ చిరుత మనసు పెరగని
నీ హృది అనురాగపు గది నిజమిదియే తెలుసుకో
నిర్మలమగు మమత తోడ
నిరంతరం మసలుకో -- వడ్డేపల్లి కృష్ణ (1948 - 2024)
Comments
Post a Comment