అగ్గలము

 

అక్టోబర్ 13, 2025

అగ్గలము (aggalamu)

   అర్థము

  (విశేషణము) : అధికం; ఎక్కువ; పెద్దది; మెండు

  Meaning

  (adj) : excessive; intolerable

    వాడుక / Usage

    మృగమదము గడు వేడి మెలుతతలపట్టునకు అగలు గూడగ వేద నగ్గలంబాయ.
    The lady applied musk to her forehead but the heat of musk increased the fever of her longing.

  మెదడుకు మేత / Food for thought

    మౌనమే నీ భాష ఓ మూగ మనసా
    తలపులు ఎన్నెన్నో కలలుగా కంటావు
    కల్లలు కాగానే కన్నీరౌతావు
    
    చీకటి గుహ నీవు చింతల చెలి నీవు
    నాటక రంగానివే మనసా తెగిన పతంగానివే
    ఎందుకు వలచేవో ఎందుకు వగచేవో
    ఎందుకు రగిలేవో ఏమై మిగిలేవో
    
    కోర్కెల సెల నీవు కూరిమి వల నీవు
    ఊహల ఉయ్యాలవే మనసా మాయల దెయ్యానివే
    లేనిది కోరేవు ఉన్నది వదిలేవు
    ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు

    -- గుప్పెడు మనసు, ఆచార్య ఆత్రేయ

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి