అరిది
అక్టోబర్ 14, 2025
అరిది (aridi)
అర్థము
(విశేషణము) : అపురూపమైన; అరుదైన; ఆశ్చర్యం
Meaning
(adj) : rare; uncommon; wonder; surprise
వాడుక / Usage
పొరసి వేగించినా బోదు తిరువేంకటాచలాధిపుని మన్నన గాని అరిదిమోహము దీరదమ్మా.
Nothing, not even pining all night, will quench her desire; only Sri Venkateshwara's love will.
మెదడుకు మేత / Food for thought
చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని
ఓటమితో గెలుపే చెప్పెను నేనున్నాననినేనున్నానని నీకేంకాదనీ నిన్నటి రాతనీ మార్చేస్తాననీ
తగిలే రాళ్లని పునాది చేసి ఎదగాలనీ
తరిమే వాళ్లని హితులుగ తలచి ముందుకెళ్లాలనీ...
కన్నుల నీటిని కలల సాగుకై వాడుకోవాలనీ
కాల్చే నిప్పుని ప్రమిదగ మలచి కాంతి పంచాలనీ
గుండెతో ధైర్యం చెప్పెను చూపుతో మార్గం చెప్పెను
అడుగుతో గమ్యం చెప్పెను నేనున్నాననీ....
నేనున్నానని నీకేంకాదనీ, నిన్నటిరాతనీ మార్చేస్తాననీ
-- నేనున్నాను, చంద్రబోస్
Comments
Post a Comment