అగలు

 

అక్టోబర్ 15, 2025

అగలు (agalu)

   అర్థము

  (క్రియ) : పగులు; చీలు; తొలగు

  Meaning

  (verb) : to break; go to pieces

    వాడుక / Usage

    బిగువైన కస్తూరి బేంట్లొయ్యనగోర నగలించి తట్టుపునుగంటరమ్మా.
    The caked musk, break it with nails softly and apply the scent of civet.

  మెదడుకు మేత / Food for thought

     ఒక్కడై రావడం...ఒక్కడై పోవడం...నడుమ ఈ నాటకం విధిలీల

    వెంట ఏ బంధమూ...రక్త సంబంధమూ...తోడుగా రాదుగా తుదివేళ
    మరణమనేది ఖాయమనీ...మిగిలెను 'కీర్తి కాయ'మనీ
    నీ బరువూ...నీ పరువూ...మోసేదీ...ఆ నలుగురూ...ఆ నలుగురూ...

    రాజనీ...పేదనీ, మంచనీ...చెడ్డనీ...భేదమే ఎరుగదీ యమపాశం
    కోట్ల ఐశ్వర్యమూ...కటిక దారిద్ర్యమూ...హద్దులే చెరిపెనీ మరుభూమి
    మూటలలోని మూలధనం...చేయదు నేడు సహగమనం
    నీ వెంట...కడకంటా...నడిచేదీ...ఆ నలుగురూ...ఆ నలుగురూ...

    నలుగురూ మెచ్చినా...నలుగురూ తిట్టినా...విలువలే శిలువగా మోశావూ
    అందరూ సుఖపడే...సంఘమే కోరుతూ...మందిలో మార్గమే వేశావూ
    నలుగురు నేడు పదుగురిగా...పదుగురు వేలు వందలుగా
    నీ వెనకే...అనుచరులై ...నడిచారూ...ఆ నలుగురూ...ఆ నలుగురూ...

    పోయిరా నేస్తమా...పోయిరా ప్రియతమా...నీవు మా గుండెలో నిలిచావు
    ఆత్మయే నిత్యమూ...జీవితం సత్యమూ...చేతలే నిలుచురా చిరకాలం
    బతికిన నాడు బాసటగా...పోయిన నాడు ఊరటగా
    అభిమానం...అనురాగం...చాటేదీ....ఆ నలుగురూ...ఆ నలుగురూ...


    -- ఆ నలుగురు, చైతన్య ప్రసాద్

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి