వినికిడి
అక్టోబర్ 21, 2025
వినికిడి (vinikidi)
అర్థము
(విశేష్యము) : వినినది; వదంతి; పుకారు; ఇంపు
Meaning
(noun) : hearing; hearsay; rumour; pleasing to the ear
వాడుక / Usage
వినికిడి లోపమా? మీరు చేసే ఈ తప్పులే కారణమట!
Hearing defect? These mistakes you do are the culprits.
మెదడుకు మేత / Food for thought
చేతికి గాజుల్లా కళ్ళకు కాటుకలా
చేతికి గాజుల్లా కళ్ళకు కాటుకలా
నుదుటికి తిలకంలా రాధకు మాధవుడు
చేతికి గాజుల్లా కళ్ళకు కాటుకలా
నుదుటికి తిలకంలా రాధకు మాధవుడు
మానసమున నీ ప్రణయము మారు మ్రోగగా
కావ్య గానమాలపించి కవి నేనైతి
మానసమున నీ ప్రణయము మారు మ్రోగగా
కావ్య గానమాలపించి కవి నేనైతి
మధుమాసం చెలి మోమున విరిబూయగనే
మధుమాసం చెలి మోమున విరిబూయగనే
భావ రాగ తాళములను మేలవించితీ
యేటికి కెరటంలా పాటకు చరణంలా
సీతకు రాముడిలా రాధకు మాధవుడు
చేతికి గాజుల్లా కళ్ళకు కాటుకలా
నుదుటికి తిలకంలా రాధకు మాధవుడు
పూల పరిమళాల గాలి పలుకరించగా
నీలి నీలి మేఘమాల పరవశించెను
పూల పరిమళాల గాలి పలుకరించగా
నీలి నీలి మేఘమాల పరవశించెను
నవనీతపు చెలి హృదయము నను చేరగనే
నవనీతపు చెలి హృదయము నను చేరగనే
అతిశయమున బ్రతుకు వీణ శృతులు చేసెనూ
పగటికి సూర్యునిలా రేయికి జాబిలిలా
గౌరికి ఈశునిలా రాధకు మాధవుడు...
చేతికి గాజుల్లా కళ్ళకు కాటుకలా
నుదుటికి తిలకంలా రాధకు మాధవుడు
-- రాధాకళ్యాణం, జ్యోతిర్మయి
Comments
Post a Comment