తక్కిడి

 

అక్టోబర్ 22, 2025

తక్కిడి (takkiḍi)

   అర్థము

  (విశేష్యము) : మోసము; త్రాసు

  Meaning

  (noun) : a lie/deceit; scales 

    వాడుక / Usage

    ఇసుక తక్కిడి, పేడ తక్కిడి. (మోసానికి ఎదురు మోసం!)
    Cheating with sand, cheating with cow dung.

  మెదడుకు మేత / Food for thought

     అందానికి అందమునేనే... జీవన మకరందము నేనే

     తీగకు పూవును నేనే... పూవుకు తావిని నేనే
     తీగకు పూవును నేనే... పూవుకు తావిని నేనే
     ధరణి అమరధామమై ఆనందము నేనే
     అందానికి అందము నేనే... జీవన మకరందము నేనే

 
     వాలు కనుల చూపు నేనే చెంగల్వ తోరణాలు
     ఆనాడు చిరునవ్వులే మల్లెవిరుల హారాలు
     నా మేనే మెరుపుతీవ... నగుమోమే... చందమామ
     నా మేనే మెరుపుతీవ... నగుమోమే... చందమామ
     నవరసాల సమ్మోహ సమ్మేళన నేనే
     అందానికి అందము నేనే... జీవన మకరందము నేనే

 
     మలయానిల లాలనలో పదేపదే పరవశమై
     మలయానిల లాలనలో పదేపదే పరవశమై
     గానమేలు ఎలకోయిల గళ మధురిమ నేనే
     గానమేలు ఎలకోయిల గళ మధురిమ నేనే
     మాయని తీయందనాలు మన వరాలై
     అవలీలగా జగమేలగా... అవలీలగా జగమేలగా...
     నవ చైతన్య సమ్మోహ సమ్మేళన నేనే
     అందానికి అందము నేనే... జీవన మకరందము నేనే
     అందానికి అందము నేనే... జీవన మకరందము నేనే


    -- చివరకు మిగిలేది, మల్లాది రామకృష్ణశాస్త్రి

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి