తొడతొక్కిడి
అక్టోబర్ 24, 2025
తొడతొక్కిడి (thoda-thokkiḍi)
అర్థము
(విశేష్యము) : ఇఱుకు; అధికము; బాగా ఎక్కువ
Meaning
(noun) : overcrowded; excessive; very tight
వాడుక / Usage
తిరునాళ్ళకు జనం తొడతొక్కిడిగా వచ్చారు.
There was a mad rush at the temple fair.
మెదడుకు మేత / Food for thought
ఓహో గులాబి బాల అందాల ప్రేమమాల
సొగసైన కనులదానా సొంపైన మనసుదానానీవారెవరో తెలుసుకో తెలుసుకో తెలుసుకో
ఓహో గులాబి బాల అందాల ప్రేమమాల
కొంటె తుమ్మెదల వలచేవు... జుంటి తేనెలందించేవు
కొంటె తుమ్మెదల వలచేవు... జుంటి తేనెలందించేవు
మోసం చేసి మీసం దువ్వి
మోసకారులకు లొంగేవు లొంగేవు
ఓహో గులాబి బాల అందాల ప్రేమమాల
రూపం చూసి వస్తారు... చూపుల గాలం వేస్తారు
రూపం చూసి వస్తారు... చూపుల గాలం వేస్తారు
రేకుల చిదిమీ సొగసులు నులిమీ
చివరకు ద్రోహం చేస్తారు
చివరకు... ద్రోహం... చేస్తారు...
ఓహో గులాబి బాల అందాల ప్రేమమాల
సొగసైన కనులదానా సొంపైన మనసుదానా
నీవారెవరో తెలుసుకో తెలుసుకో తెలుసుకో
తెలుసుకో తెలుసుకో...
-- మంచి మనిషి, దాశరథి
Comments
Post a Comment