ఔరౌర
అక్టోబర్ 27, 2025
ఔరౌర (aur-aura)
అర్థము
(అవ్యయము) : ఔర+ఔర; ఆశ్చర్యం/ప్రశంస తెలపడానికి వాడే పదం
Meaning
(interjection) : expressing wonder/surprise; is it so?!
వాడుక / Usage
ఔరౌర! కొత్తన్నంలో నెయ్యి వేసుకుని ఆవ పెట్టిన ఇగురు కూర మీగడతో నంచుకుని తింటే...
Rice with well cooked curry laced with mustard paste and cream..just wow!
మెదడుకు మేత / Food for thought
జనకభూనాథా! మోక్షానికి ఇంతకన్న పరమ శ్రేష్ఠమైన మార్గం వేరొకటి కానరాదు. సుజ్ఞానం వల్లనే గాని మానవుడు ఎన్నటికీ జన్మ జరామృత్యు బంధనాల నుండి విడివడనేరడు. కనక సుజ్ఞాన సంపాదనకే సర్వదా ప్రయత్నించవలెను. మోక్ష శ్రద్ధ లేని యెడల జనన మరణాల జంజాటం తప్పదు. అజ్ఞానం వల్లనే కర్మ సంసర్గం కలుగుతున్నది. అది నిరంతర దుస్సహదుఃఖాల కేకైక హేతువు. నేను ఉపదేశించిన మార్గంలో సాధన కొనసాగించిన యెడల తప్పక శుభం చేకూరగలదు.
-- యాజ్ఞవల్క్య జనక సంవాదం, మహాభారత శాంతి పర్వం
Comments
Post a Comment