అన్నన్న

 

అక్టోబర్ 28, 2025

అన్నన్న (ann-anna)

   అర్థము

  (అవ్యయము) : అన్న+అన్న; ఆశ్చర్యం/ప్రశంస/సంతాపం తెలపడానికి వాడే పదం

  Meaning

  (interjection) : expressing grief/surprise/admiration

    వాడుక / Usage

    అన్నన్న..! కాలం చెల్లిన నైతికత.
    Alas! this is the end of morality.

  మెదడుకు మేత / Food for thought

     ధర్మపుత్రా! సత్యవాక్పరిపాలనం కన్నా పరమధర్మం వేరొకటి లేదు. ఇదే విధంగా అసత్యోక్తి కన్నా వేరొక ఘోర పాతిత్యం లేదు. సజ్జనుల అర్థప్రాణాలు అపహరిస్తున్న వారి యెడల సత్యవాక్పరిపాలనం దారుణ పాపహేతువే కాగలదు. అటువంటి సందర్భాలలో అసత్య వచనాలతో అట్టి పాపాత్ముల నిర్మూలనమైనా మహాధర్మమే కాగలదు. ఇదే విధంగా ప్రాణులకు ఆపత్కరమైన సత్యవచనాలు అధర్మాలే అవుతున్నవి.

    -- భీష్ముడు ధర్మరాజుకు ఉపదేశం, మహాభారత శాంతి పర్వం

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి