కట్టకడ
అక్టోబర్ 31, 2025
కట్టకడ (kaṭṭa-kaḍa)
అర్థము
(విశేష్యము) : కడ+కడ; అన్నిటికీ చివర; చిట్టచివర
Meaning
(noun/adj) : the very last; end; farthest
వాడుక / Usage
ఎవరు గెలిచినా యిక్కడ ఫలమొక్కటే కట్టకడకు. ప్రజ్వలచ్చిత్తులై శోకాగ్నులొక్కటే కట్టకడకు.
The fruits are the same in the end for whoever wins. Febrile sorrowful agony is the end.
మెదడుకు మేత / Food for thought
మిత్ర శాత్రవుల వివేచన మిక్కిలి సూక్ష్మ కృత్వము. పగవారు ఒకప్పుడు ఆత్మీయులు అవుతున్నారు. ఇదే విధంగా ఆప్తులు ఒకప్పుడు విరోధులు అవుతున్నారు. ఇందువల్ల నీ సమీప నివాసం నాకు ఉచితం కాదు. కార్యవశాత్తు ఒక వేళ వైరితో చెలిమి పాటించినా, కాటు తప్పించుకుని నైపుణితో పన్నగాలను అదిమిపట్టుకోగల వారివలె నరుడు ఎంతో మెళుకువతో వ్యవహరించవలెను. బలవద్విరోధి తనకు అపకృతి సంకల్పించుకున్నా అతని పాలబడక తప్పించుకోవచ్చును. ఒకప్పుడు అత్యల్పుని తోడ్పాటుతో అయినా కష్టజలధి దాటి గట్టెక్కి బయటపడవచ్చును.
-- మార్జాల మూషిక సంవాదం, మహాభారత శాంతి పర్వం
Comments
Post a Comment