సర్జము

 

అక్టోబర్ 10, 2025

సర్జము (sarjamu)

   అర్థము

  (విశేష్యము) : మద్ది/గుగ్గిలం చెట్టు; సాల వృక్షం; చెట్టు కాండంలో నుంచి వచ్చే ఘన పదార్థము

  Meaning

  (noun) : Sal tree; resin

    వాడుక / Usage

    ఆయుర్వేదంలో జీర్ణకోశ వ్యాధులకు సర్జ రసం వాడతారు.
    The resin of Sal tree is used as a medicine for digestive ailments.

  మెదడుకు మేత / Food for thought

    పట్టు చీర అరువిచ్చి పీట పట్టుకొని వెనకాలె తిరిగినట్టుంది - మొహమాటానికి పోయి ఒకామె మరొకామెకు పట్టు చీర అరువిచ్చిందట. ఆమె ఎక్కడన్నా కూర్చుంటే తన చీరకు మట్టి అంటుతుందని ఒక పీట తీసుకొని ఆమె ఎక్కడ కూర్చుంటుందో అక్కడ పీట వేసేదట. మొహమాటానికి పోయి కష్టాలు తెచ్చుకునే వారి గురించి ఈ సామెత పుట్టింది.

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి