టిక్కిడి
అక్టోబర్ 23, 2025
టిక్కిడి (tikkiḍi)
అర్థము
(విశేష్యము) : పశువుల మెడలో తగిలించేది; కొత్త ఎద్దు మెడకి కట్టే దూలం
Meaning
(noun) : a piece of wood used to tie cattle together; a long log tied to the neck of cattle to prevent running
వాడుక / Usage
దున్నపోతుకు కట్టిన టిక్కిడి వల్ల రహదారి మీదకి పరిగెత్త లేదు.
The restraint tied to the bull prevented it from running onto the road.
మెదడుకు మేత / Food for thought
రాకోయీ అనుకోని అతిథి
కాకి చేత కబురైనా పంపకరాకోయీ అనుకోని అతిథి
వాకిటి తలుపులు... తెరువనె లేదు...
ముంగిట ముగ్గులా... తీర్చనే లేదు
వాకిటి తలుపులు... తెరువనె లేదు...
ముంగిట ముగ్గులా... తీర్చనే లేదు
వేళ కాని వేళా .....
ఈ వేళ కాని వేళ ..... ఇంటికి..
రాకోయీ అనుకోని అతిథి...రాకోయీ...
సిగలో పూవులు ముడవాలంటే....సిరిమల్లెలు వికసింపనె లేదు...
కన్నుల కాటుక దిద్దాలంటే....నిద్దుర నీడలా వీడనే లేదు..
పాలు వెన్నలు తేనే లేదు ..... పంచభక్ష్యముల చేయనే లేదు..
వేళ కాని వేళా ....ఈ వేళ కాని వేళ ....విందుకు
రాకోయీ అనుకోని అతిథి...రాకోయీ .....
ఊరక దారినె పోతూ పోతూ అలసి వచ్చితివో...
ఒంటరిగా ఉన్నానని నే..తెలిసే వచ్చితివో .....
ఒంటరిగా ఉన్నానని నే..తెలిసే వచ్చితివో...
రమ్మనుటకు సాహసము చాలదు...
పొమ్మనుటా ...మరియాద కాదది
వేళ కాని వేళా.....ఈ వేళ కాని వేళ.....త్వరపడి...
రాకోయీ అనుకోని అతిథి...
కాకి చేత కబురైన పంపక...
రాకోయీ అనుకోను అతిథి...రాకోయీ.....
-- శ్రీ రాజేశ్వరీ విలాస్ కాఫీ క్లబ్, పాలగుమ్మి పద్మరాజు
Comments
Post a Comment