కూలంకషము

 

నవంబర్ 11, 2025

కూలంకషము (koolamkashamu)

   అర్థము

  (విశేషణం) : కూలము=దరి, ఒడ్డు; కషము=ఒరుసుకునేది, రాసుకునేది; ఒడ్డుకి రాసుకునేది; సముద్రం; సమగ్రం; పూర్తిగా

  Meaning

  (noun/adj) : ocean; completely; thoroughly

    వాడుక / Usage

    సదరు భూములు విషయంలో కూలంకష తనిఖీలను తప్పనిసరి చేయనుంది.
    A thorough investigation into said land records is to be mandated.

  మెదడుకు మేత / Food for thought

    మానవజీవిత కాళరాత్రిలో
    ప్రేమచితాగ్నుల ఎర్రనినీడలు!
    నైరాశ్యపు చిక్కని చీకటిలో
    అక అస్పష్టపు కదలిక జాడలు!
    రివ్వున దూసుకపోయే నీడలు!
    నీడలనే వెన్నాడే నీడలు!
    చీకటి మూలల ఏకాంతంలో
    ఎందులకో వెదుకాడే నీడలు!
    గాలిలోన మృతకాత్మల నీడలు!
    నేలపైన కృతకాత్మల నీడలు!
    ఆశయాల ఆకాశపు నీడలు!
    వాస్తవాల యమపాశపు నీడలు!
    నీడల యుద్ధం, యుద్ధపు నీడలు!
    కర్తవ్యాల విరుద్ధపునీడలు!
    నిశ్చల విశ్వాసపు నీడల్లో,
    సంశయాల కదులాడే నీడలు!
    ఉత్సాహపు ఉరికే నీడల్లో
    అనుమానపు వెనుకాడే నీడలు!
    చావు పుట్టుకల కొండలోయలో
    బ్రతుకుల దోబూచులాడే నీడలు!
    నీడలు; నీడలజగత్తు
    మానవులంతా సుఖదుఃఖాల
    కోల్పోయిన అడుగులజాడలు!
    వెదుకుతున్న నల్లని నీడలు!
    ఘోరనిశీథపు చీరచెరగులో
    మూగరహస్యపు నీలిముసుగులో
    త్వరత్వరగా ముందుకు అడుగిడుతూ
    తడబడుతూ మరిమరి పొరబడుతూ
    పోతున్నారా? లేస్తూ పడుతూ
    నీడలు వారల మిగిలినజాడలు!
    నీడలు! నీడలు! చీకటినీడలు!

    -- చీకటి నీడలు, ఆలూరి బైరాగి

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి