కుంట

 

నవంబర్ 14, 2025

కుంట (kunṭa)

   అర్థము

  (విశేష్యము) : చెరువు; గుంట; అర ఎకరం; పాతిక సెంట్లు భూమి 

  Meaning

  (noun) : pond; pit; quarter acre; square measure of land

    వాడుక / Usage

    శంభుని కుంటను పరిరక్షించాలని సంతకాల సేకరణ.
    Signature campaign to protect Lake Shambu from encroachments.

  మెదడుకు మేత / Food for thought

    కాలపు కఠిన శిలల్లోంచి
    కాంతి జ్వాల త్రవ్వి తీస్తా !
    ఎదిరించే శతాబ్దాల నిదురకు నిప్పంటిస్తా!”
    నా శరీరం ఒక శాశ్వత హౌమం అది సూర్యుడి స్వగహం
    కవిత్వం ఒక మెస్మరిజం కవి కన్ను ఒక ప్రిజం
    నేను సృష్టించిన అలంకారం నీ అంధకారానికి దీపం
    అస్తమించే నక్షత్ర లోకాన్ని ఆవలిస్తూ చూసింది కాలం
    నాగలి భుజాన వేసుకుని వస్తున్నాడు సూర్యుడు కొండ శిఖరాలెక్కి
    అడవిలో అగ్నిజ్వాలలు కాషాయ వస్త్రాలను ధరించిన
    సన్యాసుల గుంపులా పరిగెత్తుతున్నాయిప్పుడు
    మట్టితో జీవ శిల్పం మలచే వాడి ముందు
    శూన్యంతో రేఖలు వంచే వాడి ముందు
    రూపాలు మోకారిస్తాయి!
    చెట్టు సూర్యుని గర్భంలో ధరిస్తుంది
    చెట్టు గర్భం అంతర్లోక ఆకాశం
    వర్షం వేయి చేతులతో
    నా తలుపు కొడుతుంది
    రాత్రి నేను నా దిండు కలసి కలలు కంటాం
    పగలు నేను నా కలం వాటిని పంచుకుంటాం
    సూర్యుడి నుంచి సూర్యుడికి
    ఇరవై నాలుగు గంటల దూరం
    మనిషి నుంచి మనిషికి
    రెండు గుండెల దూరం
    పావురంలా రాత్రి నా గుండె మీద వాలింది
    బాధల తుఫానును ఒక నవ్వుతో తుడిచి వేశాను

    -- మండే సూర్యుడు, గుంటూరు శేషేంద్ర శర్మ

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి