గమనము

 

నవంబర్ 17, 2025

గమనము (gamanamu)

   అర్థము

  (విశేష్యము) : ప్రయాణము; తలపు; గురి; జ్ఞాపకం 

  Meaning

  (noun) : movement; motion; attention; memory

    వాడుక / Usage

    హృదయాన విరహ భారం దేహాన అలస గమనం!
    Heart heavy with longing, body weary in motion!

  మెదడుకు మేత / Food for thought

    ఘడియలు చెప్పే గడియారంలో గంటలు గణించినపుడు,
    గండ్రగొడ్డలి వంటి పగలు కళ్లు కప్పి మాయమయ్యె కరాళ రాత్రియై;
    సువాసనలు విరిసే మల్లెతీగలు వడిలి హొయలు బాసినపుడు,
    కాలనాగు వంటి నల్లటి కురులు మెరవగా ముగ్గువలె ధవళమై;
    మహోన్నత వృక్షాలు ఆకులు రాలి మోడుగా అగుపడిన కారులో
    అవేకాదా నిరుడు మండుటెండలో మందలకి గొడుగుగా నీడనిచ్చాయి, 
    వసంతాల సరివన్నెల పచ్చిక ముడుచుకుని మూటైనపుడు పైరులో
    గడ్డ మంచు కౌగిలిలో కటుకపై తెల్లని ముసుగై మరీ నిల్చాయి,
    అప్పుడు స్ఫురించింది ఈ ప్రశ్న అహో నీ అందం
    కాలం చేసే లయవిన్యాసంలో అంతం అవ్వక తప్పదు కదా,
    ప్రేయసీ ప్రియులు తమను తాము త్యాగం చేసే అనుబంధం
    వలపుల పంట అంతకు అంత అవ్వగా తాము సమసిపోతారు గదా;
    కాలపు కొడవలి కోత నుంచి లేదు జగాన కాపాడే యే కవచం,
    కొత్త తరం తక్క, నూకలు తీరిననాడు ఎగిరిపోవడం తథ్యం ఈ వచం

    -- షేక్స్పియర్   Sonnet 12: When I do count the clock that tells the time  కి స్వేచ్ఛనువాదం

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి