గర్హ్యము
నవంబర్ 18, 2025
గర్హ్యము (garhyamu)
అర్థము
(విశేషణము) : నిందింపతగినది;
Meaning
(adj) : contemptible; deserving censure
వాడుక / Usage
గోభక్తి పేరుతో దాడులు గర్హనీయం: ప్రధాని (2017).
Lynchings on the pretext of Cow worship are contemptible : PM (2017).
మెదడుకు మేత / Food for thought
వీడ్కోలు, ఎగిసిపడుతున్న ప్రపంచమా! నేను వెళ్తున్నాను ఇంటికి తిరిగి:
నువ్వు కాదు నాకు స్నేహితుడు, కాదు నేను నీ నేస్తం.
వేసారిన నీ జన సందోహంలో, తిరిగాను ఎన్నాళ్ళో విసిగి;
చిన్న నావలో ఎదురోడి మహాలవనార్ణవం,
బ్రతుకంతా నురగల తరగల తడిసి అలసి సొలిసి తరిగి;
కానీ ఇపుడు, మిడిసిపడుతున్న ప్రపంచమా! నేను వెళ్తున్నాను ఇంటికి తిరిగి.
-- గుడ్ బై (రాల్ఫ్ వాల్డో ఎమర్సన్), కి స్వేచ్ఛనువాదం
Comments
Post a Comment