గుహ్యము

 

నవంబర్ 19, 2025

గుహ్యము (guhyamu)

   అర్థము

  (విశేష్యము) : ఏకాంతం; దాచ తగినది; తాబేలు 

  Meaning

  (noun) : solitary; secret; mysterious; tortoise

    వాడుక / Usage

    గుహ్యంగా ఉండాల్సిన ఇంటి విషయాలు రచ్చకీడిస్తే వచ్చేది కీడే.
    Private family matters in public domain cause more harm than good.

  మెదడుకు మేత / Food for thought

    వీడ్కోలు నీకు, పొగడ్తల ఓ జిత్తుల ముఖం:
    తెలివైన వెక్కిరింపుల నీకు, ఓ ఐశ్వర్యం;
    నడ మంత్రపు సిరికి, తలకెక్కిన కళ్ళకి;
    ఊడిపోయే పెద్ద పదవులకి, మారిపోయే తల రాతలకి;
    కిక్కిరిసిన దర్బారులకు, నిలువెత్తు భవనాలకు, బరువెక్కిన ఆ రహదారి;
    కరడుగట్టిన హృదయాలకి, వడి వడి తడబడి అడుగుల ఈ ఆవిరి;
    వదిలి వెళ్లేవారికి, కదిలి వచ్చే వారికి;
    వీడ్కోలు మిడిసిపడే ప్రపంచమా ! నేనేగుతున్నాను నా ఇంటికి. 
 
    -- గుడ్ బై  (రాల్ఫ్ వాల్డో ఎమర్సన్), కి స్వేచ్ఛనువాదం

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి