గమ్యము

 

నవంబర్ 20, 2025

గమ్యము (gamyamu)

   అర్థము

    (విశేష్యము/విశేషణము) : పొంద తగినది; తెలుసుకోదగినది; కదిలి చేరుకోదగ్గ ప్రదేశం/స్థితి; లక్ష్యం

  Meaning

   (noun/adj) : worthy of attaining/reaching; destination

    వాడుక / Usage

    గమ్య నగరం.. పెట్టుబడుల స్వర్గధామం!
    Destination city.. haven for investments!

  మెదడుకు మేత / Food for thought

    వెళ్తున్నాను - వెచ్చని వేడి, చల్లని నీడ, పొట్టకు కూడు, మేనుకు నిదుర ఇచ్చే - నా గూటికి, 
    ఆకుపచ్చని తివాచి పరిచిన కొండల ఒడిలోని నా ఇంటికి, --
    ఆహ్లాదకరమైన వాతావరణంలో ఓ మూల ఇమిడివున్న నా నివాసం
    చెట్లు చేమలు స్వయాన ఆ వనదేవతలే పదిలపరిచిన ఆ ప్రదేశం; 
    పచ్చని పొదలు ప్రాకే తీగలు అలరారే లతలు దినమంతా,
    కోయిల కుహూ కుహూ స్వరాల పులకింత,
    మంచి పొసగని పాదాలు తాకని భువి
    ఆలోచనలు పవిత్రం మనసులు దివ్యం ఈ దివి. 
 
    -- గుడ్ బై  (రాల్ఫ్ వాల్డో ఎమర్సన్), కి స్వేచ్ఛనువాదం

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి