గోచరము
నవంబర్ 21, 2025
గోచరము (gōcharamu)
అర్థము
(విశేష్యము/విశేషణము) : గో=ఇంద్రియం, చర=వెళ్లడం; ఇంద్రియాలతో తెలుసుకోగలిగే విషయం
Meaning
(noun/adj) : cognisable by senses; perceptible; manifest
వాడుక / Usage
తాత్కాలిక ఉద్యోగస్తుల భవిష్యత్తు అగమ్య గోచరం.
Contract workers future unrecognisable and uncertain.
మెదడుకు మేత / Food for thought
నా పర్ణశాలలో అభయంగా నేను ఉన్నప్పుడు,
సామ్రాజ్యాల దురహంకారం పై విహారం చేస్తానెపుడూ;
వటవృక్షాల కింద హాయిగా విశ్రమిస్తూ,
ధృవ తార గగన పథంలో ఉండే వేళ మెరుస్తూ,
నవ్వుకుంటాను చరిత్ర గాథలను తలచి, మనిషి గర్వం కొలిచి,
కుతర్క వాదులను చూసి, పండిత పలుకులు తూచి;
ఎందుకు వారందరు, ఇంకెందుకు వారి అహంభావం,
ప్రకృతి పురుషుడు ఒకటైన తరుణం, వెలసిన దైవం?
-- గుడ్ బై (రాల్ఫ్ వాల్డో ఎమర్సన్), కి స్వేచ్ఛనువాదం
Comments
Post a Comment