చిలుకుడు

 

నవంబర్ 24, 2025

చిలుకుడు (chilukuḍu)

   అర్థము

    (విశేష్యము) : గిలకొట్టు; తరచు; మధించు; చల్ల చేయడం

  Meaning

   (noun) : churn; sprinkle; whisk

    వాడుక / Usage

    చిలికి చిలికి చిలిపి వయసు వలపు వాన అవుతుంది; వలచి వలచి చెలియ మనసు పూల పల్లకి అవుతుంది.
    Naughty age whips up a storm of love; head over heels the damsel's heart becomes a bedecked palanquin.

  మెదడుకు మేత / Food for thought

    వాల్మీకి కథలో ఇంద్రుని విషయం అహల్యకు ముందుగానే తెలుసు. కంబరామాయణంలో వచ్చింది భర్త కాదని
    అహల్య మధ్యలో గ్రహించినా, ఆ నిషిద్ధ సుఖాన్ని వదలలేకపోతుంది. అదికాక కంబరామాయణంలో అహల్య భర్త
    పూర్తిగా జపతపాదులలో మునిగినట్లు మనకు ముందుగా సూచించడం కూడా కథకు సంక్లిష్టతను జోడిస్తుంది.
    గౌతముడు ఇంద్రునికి ఒళ్ళంతా సహస్రయోనులు కలగాలని శాపమిచ్చి, తరువాత దాన్ని సహస్రనయనాలుగా
    మారుస్తాడు; అహల్యను సుఖస్పందనలేని రాయిలా మారుస్తాడు. వాల్మీకి కథలో కనిపించని ఈ వివరాలు, దక్షిణ
    భారతంలో జానపదుల కథల్లో, తమిళ శాసనాల్లోనూ, ఇతర దక్షిణ భారత భాషల రామాయణాల్లోనూ కనిపిస్తాయి.
    అంటే, వాల్మికి కథను ఉపయోగించుకోవడమే కాక, కంబకవి తన నివసిస్తున్న ప్రాంతంలోని జానపద
    సంప్రదాయాలను తనలో కథలో గుప్పించాడన్నమాట.

    -- మూడు వందల రామాయణాలు, https://eemaata.com/em/issues/201111/1868.html?

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి