కైవడి
నవంబర్ 25, 2025
కైవడి (kai-vaḍi)
అర్థము
(విశేష్యము) : ప్రకారం; పోలిక; విధము; వలె
Meaning
(noun) : likeness; same manner; similar to; like
వాడుక / Usage
మేఘం ప్రక్కన మెరుపుకైవడి ఆయన ప్రక్కన ఒక స్త్రీమూర్తి ఉంది.
Like a lightning next to a cloud, there she appeared next to him.
మెదడుకు మేత / Food for thought
వాల్మీకి రామాయణంలోని రాముడు సంపూర్ణ మానవుడు. మానవరూపంలో కష్టసుఖాలనుభవిస్తూ, ఎలా ధర్మబద్ధమైన జీవితం గడపాలో రాముడి ద్వారా లోకానికి చెప్పబడింది. బాలకాండలోనూ, రావణుని సంహరించే సమయంలో రాముడిని పరమాత్మ స్వరూపంగా, అవతారపురుషుడిగా వర్ణించే సంఘటనలు, తరువాత జత చేసిన ప్రక్షిప్తాలని పండితుల వాదన. కంబరామాయణంలో మాత్రం రాముడు కథలో ఆసాంతం భగవత్ స్వరూపమే. కాబట్టి అహల్య కథ వంటి సంఘటనలలో భక్తి, ఆరాధనా ప్రకటనలు గాఢంగా కనిపిస్తాయి. కంబరామాయణం పన్నెండవ శతాబ్దంలో భక్తి ఉద్యమ ప్రభావంలో రాసినది.
-- మూడు వందల రామాయణాలు, https://eemaata.com/em/issues/201111/1868.html?
Comments
Post a Comment