తడలు
నవంబర్ 27, 2025
తడలు (tadalu)
అర్థము
(విశేష్యము) : తళ్లు; చిన్న అలలు; కెరటాలు
Meaning
(noun) : wave; ripple
వాడుక / Usage
చిలుకంబడు దధికై వడి, గలత నొంది,
యెడను తడలబడు ప్రాణంబులింద్రియంబులు
Like butter milk that is churned, agitated
In place and time rocked hither thither like waves, are the Senses.
మెదడుకు మేత / Food for thought
జైనరామాయణంలోనూ, తెలుగు, కన్నడ జానపదుల గేయాల్లోనే కాక, ఈ రకమైన కథ ఆగ్నేయాసియాలోని కొన్ని రామాయణాలలో కూడా కనిపిస్తుంది. ఇంతేకాక, కొన్ని రామాయణాలలో కామాంధుడైన రావణుడు, ఒక పుణ్యవతి అయిన స్త్రీని బలాత్కరించగా ఆ స్త్రీ అతని కూతురుగా పుట్టి అతని వినాశనానికి కారకురాలౌతానని ప్రతిన బూని మరణిస్తుంది. ఈ విధంగా వాల్మీకి కథలో కనిపించని కథలు, కథనాలు, స్వభావాలు, లక్షణాలు ఎన్నో మౌఖిక సంప్రదాయంలో కనిపిస్తాయి.
-- మూడు వందల రామాయణాలు, https://eemaata.com/em/issues/201111/1868.html?
Comments
Post a Comment