వంత

 

నవంబర్ 28, 2025

వంత (vantha)

   అర్థము

    (విశేష్యము) : ఏడ్పు; దుఃఖము; బాధ; సంతాపము; చిన్న ఏఱు

  Meaning

   (noun) : grief; sorrow; pain; weeping; rivulet

    వాడుక / Usage

    గందనగు పైత్యమును వియోగంపు వంత
    యెంతకలదో లెక్కగ వచియింపనగునె. 
     Insurmountable delirium and pangs of separation
     To comprehend, count is it possible or to give description? 

  మెదడుకు మేత / Food for thought

    థాయి రామాయణంలో సీత పుట్టుకకు సంబంధించిన కథనం వాల్మీకి కథనం కంటే భిన్నంగా ఉంటుంది. దశరథుడు పుత్రకామేష్టి జరిపినప్పుడు పాయసం కాకుండా లడ్డు వంటి ప్రసాదం లభిస్తుంది. అందులో కొంత భాగాన్ని ఒక కాకి నోట కరుచుకొని రావణుని భార్యకు చేరవేస్తుంది. అది తిన్న మండోదరి సీతకు జన్మనిస్తుంది. తన కూతురే తన మృత్యువుకు కారణమౌతుందని తెలిసి రావణుడు ఆ బిడ్డను సముద్రంలో పడవేస్తాడు. సముద్రుడు సీతను రక్షించి జనకునికి అందజేస్తాడు. ఇదే రకమైన కథ జైన, దక్షిణభారత జానపద రామాయణాల్లోనూ కనిపిస్తుంది.

    -- మూడు వందల రామాయణాలు, https://eemaata.com/em/issues/201111/1868.html?

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి