పొలతి
డిసెంబర్ 15, 2025
పొలతి (polati)
అర్థము
(విశేష్యము) : స్త్రీ
Meaning
(noun) : woman; lady
వాడుక / Usage
పొలతి జవ్వనామున పూవక పూచె యెలమి నిందుకు మనమేమి సేసేదే.
The nubile damsel brimming with joy, blossoms flowers; what can one do?!
మెదడుకు మేత / Food for thought
ఇది చేతులు మారి రాతలు మార్చే కాగితమోయ్
తన జేబుల నుంచి జేబులలోకి దూకేసి ఎగిరే ఎగిరే
రూపాయి రు రూపాయి ఇది రూపాయి హే రూపాయి
రుప్పి రుప్పి రుపి రూపాయి రుప్పి రుప్పి రుపి రూపాయి
కోటలు మేడలు కట్టాలన్న కాటికి నలుగురు మోయాలన్న
గుప్పెడు మెతుకులు పుట్టాలన్న ప్రాణం తీయాలన్న ఒకటే రూపాయి
ఈ ఊసరవిల్లికి రంగులు రెండే బ్లాకు అండ్ వైట్
ఈ కాసుల తల్లిని కొలిచే వాడి రాంగ్ ఇస్ రైట్
తన హుండీ నిండాలంటే దేవుడికైన మరి అవసరమేనోయ్
పోయే ఊపిరి నిలవాలన్న పోరాటంలో గెలవాలన్న
జీవన చక్రం తిరగాలన్న జననం నుంచి మరణం దాక రూపాయి

-- వేదం, రాధాకృష్ణ జాగర్లమూడి
Comments
Post a Comment