దూరు
డిసెంబర్ 22, 2025
దూరు (dūru)
అర్థము
(విశేష్యము/క్రియ) : నిందించు; తిట్టు; ప్రవేశించు; తూర్పు
Meaning
(noun/verb) : rebuke; censure; enter; east
వాడుక / Usage
నేరకుంటే నరకము నేరిచితే స్వర్గమంటూ, దూరువేసేవింతేకాక దోషమెవ్వరిదయ్యా.
Heaven if you know, hell if you don't - this you say and accuse us - but whose fault is it?!
మెదడుకు మేత / Food for thought
మనసున మల్లెల మాలలూగెనే
కన్నుల వెన్నెల డోలలూగెనే
ఎంతహాయి యీ రేయి నిండెనో
ఎన్నినాళ్లకీ బతుకు పండెనో
కొమ్మల గువ్వలు గుసగుసమనినా
రెమ్మల గాలులు ఉసురుసురనినా
అలలు కొలనులో గలగలమనినా
దవ్వుల వేణువు సవ్వడి వినినా
నీవు వచ్చేవని నీ పిలుపే విని
కన్నుల నీరిడి కలయజూచితిని
గడియ యేని యిక విడిచిపోకుమా
ఎగసిన హృదయము పగులనీకుమా
ఎన్నినాళ్లకీ బతుకు పండెనో
ఎంత హాయి యీ రేయి నిండెనో
-- మల్లీశ్వరి, దేవులపల్లి
Comments
Post a Comment