ఇగురుబోడి
డిసెంబర్ 19, 2025
ఇగురుబోడి (iguru-bōḍi)
అర్థము
(విశేష్యము) : చిగురువలే అందంగా ఉండే యువతి; స్త్రీ
Meaning
(noun) : woman; a blossoming tender lady
వాడుక / Usage
పొగరు శ్రీవేంకటేశు పొందుల కప్రము పూచె ఇగురుబోండ్ల మింక నేమి సేసేదే.
Radiating pride in her union with Sri Venkatesha she adorns the stifling camphor; alas what can we tender ladies do?!
మెదడుకు మేత / Food for thought
మరుమల్లెల్లో ఈ జగమంతా విరియగా
ప్రతి ఉదయంలో శాంతి కోసమే తపనగా
పారాణేదో భుమికి వెలుగుగా
మందారాలే మత్తును వదలగా
కనుల తడి తుడిచే ఒడిలో పసి పాపాయి
చిలికే చిరునగవే చీకటితల్లికి వేకువ
గాలిపాటల జడివాన జావళి, అది మౌనంలా మధురం ఔనా?
వేలమాటలే వివరించ లేనిది, తడి కన్నుల్లా అర్థం ఔనా?
లేతపాపల చిరునవ్వుతోటకే దిగివస్తావా సిరులవెన్నెలా
వీరభూమిలో సమరాలు మానితే వినిపించేనా స్వరమే కోయిలా

-- అమృత, వేటూరి
Comments
Post a Comment