డిసెంబర్ 29, 2025
నిర్దాక్షిణ్యము (nir-dākshiṇyamu)
అర్థము
(విశేషము) : దయ/కనికరం లేకపోవడం
Meaning
(noun) : paucity of kindness/feeling
వాడుక / Usage
ప్రకృతి పసి పాపాయై చేసే అల్లరి చప్పుళ్లే కాదు, కోపంతో ముఖం చాటేసి నిర్దాక్షిణ్యంగా జీవితాల్ని చిదిమి పారేసే మృత్యువు కూడా వానే.
It is not just the toddler, of nature, that makes raucous noises; rain is also death incarnate that can turn its face away in anger and end lives without an iota of kindness.
మెదడుకు మేత / Food for thought
నదులు ఎండిపోయాయి. అడుగున ఉన్న చేపలు పొట్ట నీలుక్కుని బురద మీద పైకి తేలాయి. అడవులు చాలా మటుకు తగలబడ్డాయి. సముద్రాలు పొర్లుకొచ్చి నేలను చేతులతో కమ్ముకున్నాయి. అదుపు చేయలేని క్రిమి ఏదో సోకి మనుషులు కుప్పలు తెప్పలుగా రాలిపోయారు. ఏ కారణం చేతనో ఒక తల్లి తన బిడ్డల గొంతు నులిమి ఆత్మహత్య చేసుకుంది. ప్రాణస్నేహితుడొకడు చెప్పా పెట్టకుండా ఆ పూట యాక్సిడెంట్ లో ప్రాణాలు వొదిలాడు. చుట్టూ మబ్బుపట్టిన చీకటి. మసక. ప్రాణవాయువు రెపరెపలు లేని నిశ్వాసల గాలి. ఇంకా ఏం మిగిలింది ఈ సాయంత్రానికి అనిపించింది అతనికి. కాదు. ఇంకా ఈ ఒక్క సాయంత్రమే మిగిలింది బతకడానికి అని అనిపించింది అతనికి.
-- ఒక సాయంత్రపు అదృష్టం, మహమ్మద్ ఖదీర్ బాబు
Comments
Post a Comment