ముహూర్తము
డిసెంబర్ 04, 2025
ముహూర్తము (muhūrtamu)
అర్థము
(విశేష్యము) : నలభై ఎనిమిది నిమిషాల కాలం; నిమేష కాలం; త్రుటి; శుభకార్యాలు చేసే కాలం
Meaning
(noun) : 48 minutes; a moment or instant; auspicious time
వాడుక / Usage
మూడో విడతకు ముహూర్తం - నేటి నుంచి నామపత్రాల స్వీకరణ.
Date fixed for third phase - nominations from today.
మెదడుకు మేత / Food for thought
మరువకను నీ దివ్య నామస్మరణ మెప్పుడు చేయుచుంటిని
సత్కృపను ఇక వరము లిచ్చెడి స్వామి వనుచును ఎంచు నను మీ
సరిగ వేల్పులు లేరటంచును మరిగ నే చాటుచును నుంటిని
రాతి నాతిగ చేసినావు అజామిళునిపై కృప గలిగి ని-
ర్హేతుకంబుగ బ్రోచితివి ప్రహ్లాదు గాచితి వట సభను ద్రౌ-
పతికి చీరల నొసగితివి సుంతైన నాపై దయను జూపవు

-- రామదాసు
Comments
Post a Comment