డిసెంబర్ 31, 2025
శాసనము (ṣāsanamu)
అర్థము
(విశేషము) : ఆజ్ఞ; అధికారం; రాజ్యపాలనం; శాస్త్రం
Meaning
(noun) : command; edict; rule; science
వాడుక / Usage
కళ్ళకు కనిపించే ప్రాణులతో పాటు, కనిపించని కోట్లాది జీవరాశుల బతుకులు శాసించేదే వాన.
Not just the organisms that we see, the plethora of invisible microorganisms are governed by rain.
మెదడుకు మేత / Food for thought
అంత గొప్ప ప్రవాహంలో సంతత ధారగా వాన పడిపోతోంది. నీళ్లలో నీళ్లు. ధారలో ధార. ప్రవాహంలో ప్రవాహం. వాన చినుకులు కృష్ణలో పడుతుంటే పెద్దక్క ప్రేమగా హత్తుకుంటే వొళ్ళు జలదరించినట్లు ఆ ప్రవాహం మీద ఓ జలదరింపు. సిగ్గుతో నవ్వినప్పుడు బుగ్గమీద సొట్టలా చినుకుపడ్డ చోట చిన్న గుంట. కృష్ణ అంతా చినుకులు. ఇసక నిండా, నేల నిండా - రెండు గంగాలు కలిసిపోయినట్లు, నింగి నేల ఒకటే అన్నట్లు. ఈ జగత్తులో నీళ్లు తప్ప ఇంకేవీ లేనట్టు అన్నిటికీ నీళ్ళే ఆధారమన్నట్లు వాన, వర్షం, గంగమ్మ, కిష్టమ్మ, సంద్రం - అదేదో దానికి నువ్వే పేరైనా పెట్టుకో.
-- రెండు గంగలు, సత్యం శంకరమంచి
Comments
Post a Comment