నేపథ్యము

 

జనవరి 01, 2025

నేపథ్యము (nēpathyamu)

   అర్థము

    (విశేషము) : వేషము; రంగస్థలం; తెర వెనుక నటులుండే చోట; ఒక సంఘటనకు పూర్వ వృత్తాంతం

  Meaning

   (noun) : dress of an actor; a stage; curtain behind which actors retire; context; background

    వాడుక / Usage

    అలంటి వాన నేపథ్యంలో తెలుగులో అనేకానేక కథలు వచ్చాయి.
    With a backdrop of such rain there have been many Telugu stories.

  మెదడుకు మేత / Food for thought

    క్షయ సంవత్సరంలో వానలు కురసవు అని చెప్పేవాళ్ళు కొంతమంది. అది క్షయ కాదు. అక్షయ. సంవత్సరంలో వానలు దండిగా కురిసి తీరల్ల అని ఆశను లెబెట్టేవాళ్ళు కొంతమంది. ఎవరి మాటను ఇనేది? ఎవరి మాటను ఇడిసి పెట్టేది? ఊర్లో వాళ్ళకేమో శానామందికి ధైర్యం సాలలే ఇత్తనం ఏసేదానికి. అప్పటికే ఒక సంవత్సరం వర్షాలు పడక సేద్యంలో దెబ్బ తినిండిరి మల్ల పాపం! ఊర్లో చానామంది రైతులు ఎనకడుగు ఏస్తంటే పెన్నప్ప ముందడుగు యేసే.


    -- వాన రాలే, బండి నారాయణ స్వామి  

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి