సతి
డిసెంబర్ 16, 2025
సతి (sati)
అర్థము
(విశేష్యము) : స్త్రీ; మంచి ఇల్లాలు; పార్వతి
Meaning
(noun) : woman; virtuous woman; Parvathi
వాడుక / Usage
సతిచింతాలతలో సంపెంగపూవులు పూచె మతివిరహపు మేన మల్లెలు పూచె.
The woman's thoughts undulating like creepers flowered Champaks; her longing blossomed as jasmines on her body.
మెదడుకు మేత / Food for thought
ఎంతవరకు ఎందుకొరకు ఇంత పరుగు అని అడక్కు
గమనమే నీ గమ్యమైతే బాటలోనే బ్రతుకు దొరుకు
ప్రశ్నలోనే బదులు ఉంది గుర్తుపట్టే గుండెనడుగు
ప్రపంచం నీలో ఉన్నదని చెప్పేదాక ఆ నిజం తెలుసుకోవా
తెలిస్తే ప్రతీ చోట నిన్ను నువ్వే కలుసుకుని పలకరించుకోవా
గమనమే నీ గమ్యమైతే బాటలోనే బ్రతుకు దొరుకు
ప్రశ్నలోనే బదులు ఉంది గుర్తుపట్టే గుండెనడుగు
ప్రపంచం నీలో ఉన్నదని చెప్పేదాక ఆ నిజం తెలుసుకోవా
తెలిస్తే ప్రతీ చోట నిన్ను నువ్వే కలుసుకుని పలకరించుకోవా
మనసులో నీవైన భావాలే బయట కనిపిస్తాయి దృశ్యాలై
నీడలు నిజాల సాక్ష్యాలే శతృవులు నీలోని లోపాలే
స్నేహితులు నీకున్న ఇష్టాలే ఋతువులు నీ భావ చిత్రాలే..
ఎదురైన మందహాసం నీలోని చెలిమి కోసం
మోసం,రోషం,ద్వేషం నీ మకిలి మతికి భాష్యం
పుటక చావు రెండే రెండు నీకవి సొంతం కావు పోనీ..
జీవితకాలం నీదే నేస్తం రంగులు ఏం వేస్తావో కానీ

-- గమ్యం, సీతారామ శాస్త్రి
Comments
Post a Comment