శరణాగతుడు
డిసెంబర్ 23, 2025
శరణాగతుడు (ṣaran-āgatudu)
అర్థము
(విశేష్యము) : శరణు (రక్ష, ఆశ్రయం) కోరువాడు
Meaning
(noun) : one who comes for refuge, shelter or protection
వాడుక / Usage
సర్వాంతరాత్ముడవు శరణాగతుడ నేను, సర్వాపరాధినైతి చాలుజాలునయ్యా.
You are the Supreme Consciousness that animates everything; I am the one seeking refuge in you having committed sins galore - enough is enough.
మెదడుకు మేత / Food for thought
మనసే అందాల బృందావనం
వేణు మాధవుని పేరే మధురామృతం
మనసే అందాల బృందావనం
వేణు మాధవుని పేరే మధురామృతం
కమ్మని నగుమోము కాంచుటె తొలినోము
కడగంటి చూపైన కడుపావనం
మనసే అందాల బృందావనం
వేణు మాధవుని పేరే మధురామృతం
రాధను ఒక వంక లాలించునే
సత్యభామను మురిపాల తేలించునే
రాధను ఒక వంక లాలించునే
సత్యభామను మురిపాల తేలించునే...
మనసార నెరనమ్ము తనవారినీ
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆఆ....
మనసార నెరనమ్ము తనవారిని
కోటి మరులందు సుధలందు తనియింతునే..
-- మంచి కుటుంబం, ఆరుద్ర
Comments
Post a Comment