తొయ్యలి

 

డిసెంబర్ 17, 2025

తొయ్యలి (toyyali)

   అర్థము

    (విశేష్యము) : స్త్రీ; ఇంతి

  Meaning

   (noun) : woman

    వాడుక / Usage

    తొయ్యలిచెమటనీట దొంతితామెరలు పూచె కొయ్యచూపు కోపముల కుంకుమ పూచె.
    Flushed the woman is, her beads of perspiration dotted like lotuses; eyes fixed in (fake) anger bloomed flowers of vermilion.

  మెదడుకు మేత / Food for thought

    ఒక్కడై రావడం ఒక్కడై పోవడం
    నడుమ ఈ నాటకం విధిలీల
    వెంట ఏ బంధమూ రక్త సంబంధమూ
    తోడుగా రాదుగా తుదివేళ
    మరణమనేది ఖాయమనీ మిగిలెను కీర్తి కాయమనీ
    నీ బరువూ నీ పరువూ మోసేదీ
    ఆ నలుగురూ ఆ నలుగురూ ఆ నలుగురూ ఆ నలుగురూ

    నలుగురూ మెచ్చినా నలుగురూ తిట్టినా
    విలువలే శిలువగా మోశావూ
    అందరూ సుఖపడే సంఘమే కోరుతూ
    మందిలో మార్గమే వేశావూ
    నలుగురు నేడు పదుగురిగా పదుగురు వేలు వందలుగా
    నీ వెనకే అనుచరులై నడిచారూ
    ఆ నలుగురూ ఆ నలుగురూ ఆ నలుగురూ ఆ నలుగురూ

    -- ఆ నలుగురు, చైతన్య ప్రసాద్ 

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి