డిసెంబర్ 30, 2025
విషాదము (vishadamu)
అర్థము
(విశేషము) : దుఃఖము; నిరాశ; దౌర్బల్యము
Meaning
(noun) : grief; sorrow; dejection
వాడుక / Usage
ఆనందం, ఆశ్చర్యం, భయం, బీభత్సం, విషాదం, దుఃఖం వానకున్న అనేక ముఖాలు.
Joy, surprise, fear, horror, dejection, sorrow are all the different facets of Rain.
మెదడుకు మేత / Food for thought
అప్పుడు కూడా ఇలాగే వాన. షామియానా వేసి వీధిలో శవాన్ని పడుకోబెడితే వాన పెరిగి పెద్దదయ్యి శవం ముద్దముద్దగా తడిసిపోయింది. అప్పుడు వాడు చిన్నవాడు. లోకం మంచి చెడ్డలు తెలియనివాడు. హఠాత్తుగా తండ్రి చనిపోతే దిక్కుతోచక ఉన్నవాడు. అలంటి వాడు తండ్రి శవం దగ్గర నిలబడి వీధిలోంచి పారుతున్న వర్షం నీటికి శవం ఉన్న బల్ల కదిలిపోతుందేమోనని అది కదలకుండా గట్టిగా పట్టుకుని గుండెలవిసేలా ఏడ్చాడు. ఆ తర్వాత శాశ్వతంగా వాడు ఆ రోజులోనే ఉండిపోయాడు.
-- ఒక సాయంత్రపు అదృష్టం, మహమ్మద్ ఖదీర్ బాబు
Comments
Post a Comment